కొలంబో, ఏప్రిల్ 5: శ్రీలంక వన్దే , ట్వంటీ-20 జట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి కుమార సంగక్కర వైదొలిగాడు. టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతానని మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు. కొత్త కెప్టెన్‌కు ఉపయోగకరంగా ఉంటుందని క్రికెట్ అధికారులు భావిస్తే, టెస్టుల్లో జట్టును నడిపించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. జట్టు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వన్దే , టి-20 జట్ల నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగుతున్నానని అన్నాడు. 2015 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే కొత్త సారథిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సెలక్టర్లను కలుసుకొని తన నిర్ణయాన్ని వెల్లడించానని సంగక్కర తెలిపాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలన్న ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని స్పష్టం చేశాడు. టెస్టులతోపాటు, వన్దే , ట్వంటీ-20 జట్లలో ఆడడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు.
No comments:
Post a Comment