ఖమ్మం, ఏప్రిల్ 5: రాజ్యాంగ బద్ధంగా షెడ్యూల్‌ను అనుసరించి యథావిధిగా సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలో కూసుమంచిలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు విషయమై కోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తోందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు తెలిపామని చెప్పారు. అడ్వకేట్ జనరల్‌తో ఎన్నికల నిర్వహణ విషయంపై కోర్టు కేసు గురించి చర్చిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల అంశంపై ఎప్పటికప్పుడు నిపుణులను సైతం సంప్రదిస్తున్నట్లు జానా చెప్పారు
No comments:
Post a Comment