గత నవంబర్‌లో గెయిల్ పైప్‌లైన్‌లో ఏర్పడ్డ అగ్నిప్రమాదం కారణంగా గ్యాస్ ఉత్పత్తికి కొంత అవరోధం ఏర్పడినప్పటికీ, ప్రత్యామ్నాయ పైపులైన్ ద్వారా తిరిగి ఉత్పత్తిని కొనసాగించింది. 1356 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తిచేయాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న రాజమండ్రి అసెట్, 2010-11లో లక్ష్యాన్ని అధిగమిస్తూ 1384.3 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తిచేసింది. తాటిపాక మిని రిఫైనరీ నుండి 66 మెట్రిక్ టన్నుల విలువ ఆధారిత ఉత్పత్తులను సాధించాలన్న లక్ష్యాన్ని, 67.78 మెట్రిక్ టన్నులతో సాధించింది. కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి వద్ద ఉన్న మల్లేశ్వరంలోని ఎంఎస్‌ఏఏ బావి రోజుకు 35 టన్నుల ముడి చమురును ఉత్పత్తిచేయటం 2010-11 ఆర్థిక సంవత్సరంలో రాజమండ్రి ఒఎన్‌జిసి అసెట్ సాధించిన మరో విజయం. డ్రిల్లింగ్ కార్యకలాపాలు ముగించిన 10 రోజుల్లోనే ఈ బావి నుండి చమురును ఒఎన్‌జిసి ఉత్పత్తిచేస్తోంది.
Wednesday, April 6, 2011
చమురు ఉత్పత్తిలో ఒఎన్‌జిసి రాజమండ్రి అసెట్ కొత్త రికార్డు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment